ఊరూరా మద్యం | - | Sakshi
Sakshi News home page

ఊరూరా మద్యం

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

ఊరూరా మద్యం ● ప్రొద్దుటూరులో విచ్చలవిడిగా గోవా మద్యం

ప్రాణాలను హరిస్తున్న మద్యం

వేకువజామునే తెరుస్తున్నమద్యం షాపులు

అర్దరాత్రి వరకు నిర్వహించేబార్లు, వైన్‌ షాపులతోశాంతి భద్రతలకు విఘాతం

24 గంటల పాటు విచ్చలవిడిగావైన్‌ షాపుల్లో అమ్మకాలు

అడ్డూ అదుపూ లేకుండాఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్న మద్యం

ప్రొద్దుటూరు క్రైం: రాత్రి 10 దాటిందంటే చాలు... పాలు దొరకదు.. ఇక కాఫీ..టీ తాగాలంటే తెల్లవారే వరకు ఆగాల్సిందే. అదే ఆరోగ్యానికి హాని కలిగించే మద్యం మాత్రం 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది.. పల్లె.. పట్టణం తేడా మద్యం షాపులు ‘బార్లా’ తెరిచి ఉంటాయి.. ఇదీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు తీరు. అడ్డూ అదుపూ లేకుండా దొరికే ఈ మందు మహమ్మారి అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది. జిల్లాలో దాదాపుగా మద్యం షాపులు, బార్లు అధికార కూటమి నేతలవి, వారి బినామీలవి కావడంతో ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు చర్యలు తీసుకునేందుకు సాహసించడం లేదు. పైగా కొందరు పోలీసు, ఎకై ్సజ్‌ అధికారులు నెలవారి మామూళ్లు తీసుకోవడంతో ఇక మద్యం వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది.

● జిల్లాలో 141 మద్యం దుకాణాలు, 28 బార్లు ఉన్నాయి. మద్యం షాపుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు, బార్లలో ఉదయం 10 నుంచి అర్దరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయించుకునేలా కూటమి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే అర్దరాత్రి వరకు బార్లు తెరచి ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందనే ఉద్దేశంతో పోలీసు అధికారులు 11 గంటలకే మూయిస్తున్నారు.

వేకువ జామునే మద్యం అమ్మకాలా..

వైస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం షాపుల నిర్వహణ జరిగేది. దీని వల్ల ఖచ్చిత సమయపాలన పాటించేవారు. నాడు ఉదయం 11 గంటలకు వైన్‌ షాపులు తెరచి రాత్రి 9 గంటలకు మూసేవారు. 9 గంటల తర్వాత తిరిగి మరుసటి రోజు 11 గంటల వరకు బయట ఎక్కడా మద్యం దొరికేది కాదు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతోంది. మంచి నీళ్లైనా దొరుకుతాయో లేదో గానీ మందు మాత్రం ఎంత కావాలన్నా సులభంగా లభిస్తోంది. వేకువజామున 5.30 గంటల నుంచే ప్రొద్దుటూరు, కడప, మైదుకూరు, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో వైన్‌ షాపులు దర్శనం ఇస్తున్నాయి. బార్లు కూడా మద్యం షాపులకు పోటీగా ఉదయాన్నే తెరుచుకుంటున్నాయి. ప్రభుత్వం అనుమతిచ్చిన పర్మిట్‌ రూంలలో నిల్చొని మాత్రమే మద్యం తాగేందుకు వెసులుబాటు ఉంది. అయితే జిల్లాలోని అన్ని మద్యం షాపుల్లో బార్లను తలపించేలా తనివితీరా కూర్చొని తాగేందుకు వసతులు ఏర్పాటు చేశారు. కొన్ని వైన్‌ షాపుల్లో బార్లను మించిన లైటింగ్‌ డెకరేషన్‌, సిట్టింగ్‌ సదుపాయాన్ని కల్పించారు. రాత్రి షాపులు మూసిన తర్వాత అక్కడి వాచ్‌మెన్‌, నైట్‌ డ్యూటీ సిబ్బంది ద్వారా ఎమ్మార్పీ కంటే రూ. 20కి అదనంగా మద్యం విక్రయిస్తున్నారు. ఇలా ఉదయం షాపులు తెరిచే వరకు రాత్రంతా మద్యం విక్రయాలు చేస్తున్నారు.

గ్రామాల్లో వాడ వాడలా మద్యం అమ్మకాలు

జిల్లాలోని అనేక గ్రామాల్లో బెల్ట్‌ షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు. అధికార టీడీపీ నాయకుల కనుసన్నల్లో ఈ అనధికార విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే పెరిగిన మద్యం ధరలతో మందు బాబులు ఇబ్బంది పడుతుండగా వైన్‌షాపుల్లో కంటే అదనంగా రూ. 20లకు విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నారు. గ్రామాల్లో అధిక శాతం పేద, బడుగు, బలహీన వర్గాల వారే ఉన్నారు. పగలంతా కష్టపడి సంపాదించిన కూలి డబ్బులను రాత్రి అయ్యే సరికి మద్యానికి ధార పోస్తున్నారు. కూలి డబ్బులను ఇంటికి తీసుకుపోకుండా దారిలోనే బెల్ట్‌ షాపులకు వెళ్లి ఖర్చు చేస్తున్నారు. అఽధికార పార్టీ నాయకులు పోలీసులు, ఎకై ్సజ్‌ అధికారులను లెక్కచేయడం లేదు. పోలీసు అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే తమ ప్రభుత్వం ఉందంటూ వారిపైనే ఎదురు తిరగబడుతున్నారు.

మద్యం మత్తులో గొడవలు జరగడం, చంపుకోవడం లాంటి ఘటనలు నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోటు చేసుకుంటున్నాయి. మద్యమే అన్ని అనర్ధాలకు కారణంగా నిలుస్తోంది. ఇటీవల ప్రొద్దుటూరులోని నెహ్రూరోడ్డులో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన తల్లిని ధూషించడానే కారణంతో తన స్నేహితుడినే కత్తితో పొడిచి చంపేశాడు

– ఒక వ్యక్తి కొత్తగా కూల్‌డ్రింక్‌ షాపు ప్రారంభించాడు. అయితే షాపు ప్రారంభిస్తున్న సందర్భంగా స్నేహితులను పిలిచి పార్టీ ఇచ్చాడు. పార్టీలో మద్యం తాగి ఫుల్‌ కై పులో ఉన్న స్నేహితులు డబ్బు బాకీ విషయమై గొడవ పడ్డారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి రాడ్డుతో కొట్టడంతో సొంత స్నేహితుడి తలకు రక్తస్రావమై కింద పడిపోయాడు. రెండు రోజుల తర్వాత మృతి చెందాడు. ప్రొద్దుటూరులోని శ్రీనివాసనగర్‌, ఈశ్వరెడ్డినగర్‌, పెన్నానగర్‌, కేహెచ్‌ఎం స్ట్రీట్‌ తదితర ప్రాంతాల్లో మైనర్లు బ్యాచ్‌లుగా ఏర్పడి మద్యం తాగుతున్నారు.

జిల్లాలోనే ప్రొద్దుటూరుకు వాణిజ్య కేంద్రంగా మంచి పేరుంది. దీంతో అన్ని వ్యాపారాలతో పాటు మద్యం వ్యాపారం కూడా ఇక్కడ జోరుగా జరుగుతుంది. 365 రోజులు బార్లు, మద్యం షాపులు కళకళ లాడుతుంటాయి. అయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల మద్యాన్ని విక్రయిస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో అనేక మార్లు ఎకై ్సజ్‌ అధికారులు గోవా, హర్యాణా, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని పట్టుకున్నారు. ఈ ఏడాది జనవరిలో కారుతో సహా 174 లీటర్ల గోవా మద్యాన్ని ప్రొద్దుటూరు ఎకై ్సజ్‌ సీఐ సురేంద్రారెడ్డి స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. అలాగే అదే నెలలో హర్యాణా రాష్ట్రానికి చెందిన సుంకం చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కారుతో సహా ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. ఇదే క్రమంలో శనివారం ఎకై ్సజ్‌ సీఐ సురేంద్రారెడ్డి ప్రొద్దుటూరులో పెద్ద మొత్తంలో గోవా మద్యం బాటిళ్లను పట్టుకున్నారు. అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పామిడి ఆకుల ఇర్ఫాన్‌, నందిండ్ల బాషా అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి రెండు కార్లు, 750 ఎంఎల్‌ సామర్థ్యం గల 480 గోవా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement