పెద్దతిప్పసముద్రం: ప్రభుత్వ సిబ్బంది చేపడుతున్న గృహాల సర్వేపై డేటా చోరీ అవుతుందేమోనన్న అపోహలను ప్రజలు విడనాడాలని డీఆర్వో చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన మండల కేంద్రంలో జరుగుతున్న సర్వేను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్వో విలేకరులతో మాట్లాడుతూ మండలంలో పెండింగ్‌లో ఉన్న 15 శాతం జనగణన సర్వేను సకాలంలో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. ప్రతి ఇంటినీ ఖచ్చితంగా సర్వే చేయాలని అదే విధంగా తప్పిపోయిన గృహ యజమానుల వివరాలను సేకరించాలని, శెలవుల్లో బయట ప్రాంతాలకు వెళ్ళిన వారిని ఆరా తీయాలని సూచించామన్నారు. సర్వేలో నమోదైన వివరాల్లో తప్పిదాలు ఉంటే వాటిని సవరించేలా చొరవ చూపుతున్నామన్నారు.


