పీలేరురూరల్/సదుం : ఆగివున్న లారీని బైక్ ఢీకొనడంతో స్కూటరిస్టు మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి వేపులబైలు పంచాయతీలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సదుం మండలం ఊటుపల్లెకు చెందిన ఎన్. మంజునాథ (37) వేపులబైలు పంచాయతీలో భారత్ పెట్రోలియం బంకులో పంపుమ్యాన్‌గా పని చేస్తున్నాడు. శనివారం రాత్రి ద్విచక్రవాహనంలో పీలేరుకు వచ్చి తిరుగుప్రయాణమయ్యాడు. టీ స్టాల్ వద్ద ఆగివున్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మంజునాథను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. మృతునికి భార్యతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.


