బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ను బ్రిటిష్ ప్రభుత్వం వేసవి విడది కేంద్రంగా ప్రకటిసూ్‌త్ 1869 మే4న జీవోఎంఎస్ నంబర్ 11579 జారీచేసింది. దట్టమైన ఈ కొండంతా రిజర్వ్‌ఫారెస్ట్ కావడంతో అతిథి గృహం నిర్మాణం కోసం ఈ కొండను కనుగొన్న డబ్ల్యూడి. హార్సిలీ ఉమ్మడి కడపజిల్లా కలెక్టర్ కావడంతో ఆయన మద్రాసు ప్రభుత్వ అనుమతి కోరారు. ఈ వినతికి అనుమతి ఇస్తూ 1869 జూన్ 9న జీవోఎంఎస్ నంబర్ 4162ను జారీచేసింది. దీంతో కొండపై తొలి అతిథి గృహం నిర్మాణం జరిగింది. దీనికి వినియోగించిన పెంకులను హార్సిలీ ఇంగ్లాండ్ నుంచి ఓడలో పెంకులను మద్రాసుకు తెప్పించి, అక్కడినుంచి కొండపైకి రవాణా చేయించుకున్నారు. ఇంగ్లాండ్‌లో 1865లో బేస్డ్ మిషన్ టైల్ వర్క్స్ అనే కంపెనీ పెంకులను తయారు చేసినట్టు వాటిపై వివరాలున్నాయి. అటవీశాఖ అతిథిగృహాల్లో ఒకటైన ఇప్పటి కళ్యాణీ అతిథిగృహంగా పిలుచుకునే గదే తొలి అతిథిగృహం
–సాక్షి, మదనపల్లె


