అనంత నిమ్మకు ప్రపంచ గుర్తింపు దిశగా అడుగులు | - | Sakshi
Sakshi News home page

అనంత నిమ్మకు ప్రపంచ గుర్తింపు దిశగా అడుగులు

May 25 2026 1:40 AM | Updated on May 25 2026 1:40 AM

మదనపల్లె (కురబలకోట) : నోటికి పులుపుతో పాటు ప్రత్యేక రుచి శుచి నాణ్యతకు పేరొందిన అనంతపురం నిమ్మకాయకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకు వచ్చేందుకు అంగళ్లులోని మిట్స్‌ డీమ్డ్‌ యూనివర్సిటీ బౌగోళిక (జీఐ) గుర్తింపు కోసం ధరఖాస్తు చేసినట్లు వీసీ యువరాజ్‌ ఆదివారం తెలిపారు. ఈ నిమ్మ ఇప్పటికే మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. ఇది చిన్న పండే అయినా తాజాదనం, ఉత్సాహం చురుకుదనానికి ప్రతీకగా భావిస్తారన్నారు. పెద్దపప్పూరు, పెద్దవడుగూరు, తాడిపత్రి, యాడికి మండలాల్లో ప్రత్యేక వాతావరణ పరిస్థితుల కారణంగా దీనికి విశిష్ట లక్షణాలు ఏర్పడ్డాయన్నారు. అనంతపురంలోని అవని ఫారం ల్యాబ్‌ టెక్నాలజీస్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ లిమిటెడ్‌ ద్వారా మిట్స్‌ ఐపీఎఫ్‌సీ, ఆర్‌ అండ్‌డీ కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. జీఐ ట్యాగ్‌ లభిస్తే అనంత నిమ్మకు ప్రపంచ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు ఆపై మరింత గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు.

జీఐ ట్యాగ్‌కు మిట్స్‌ ధరఖాస్తు

Advertisement
 
Advertisement
Advertisement