వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్‌సీఎస్ క్రికెట్ క్రీడామైదానంలో సీసీఎల్–2 క్రికెట్ పోటీలు ఆదివారం జరిగాయి. ఉదయం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆదిత్యా బీఆర్ జట్టు, హైపెరియన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆదిత్యా బీఆర్ జట్టు 225 పరుగులు చేసి విజయం సాధించగా.. హైపెరియన్ జట్టు 206 పరుగులు చేసి ఓటమి పాలైంది. మధ్యాహ్నం పయ్‌వైస్రాయ్, స్పార్టన్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో స్పార్టన్ వారియర్స్ 211 పరుగులు చేయగా.. పాయ్‌వైస్రాయ్ జట్టు 212 పరుగులు చేసి విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో జహీర్ అబ్బాస్ మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును కై వసం చేసుకున్నారు. కార్యక్రమంలో విజయ్‌కుమార్, సతీష్‌యాదవ్, శ్రీధర్‌కుమార్, సునీల్ కుమార్, ప్యానెల్ అంపైర్స్ హసన్‌షావలి, కిరణ్, క్రీడాకరులు పాల్గొన్నారు.


