సాక్షి, మదనపల్లె: స్థానిక డిస్కం డివిజన్ కార్యాలయంలో ఆదివారం వినియోగదారులు విద్యుత్ బిల్లులను చెల్లించవచ్చని గంగాధరం శనివారం తెలిపారు. ఉదయం నుంచి రాత్రి వరకు డివిజన్ కార్యాలయ కౌంటర్లలో సిబ్బంది విధుల్లో ఉంటారని బిల్లులు చెల్లించి సహకరించాలని కోరారు.
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఆలయ నిర్వాహకులు విశేష ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అశ్వ వాహనం, సోమవారం గజవాహనం, మంగళవారం హంస వాహనంపై మల్లమ్మ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించనున్నారు.
సాక్షి, మదనపల్లె: వర్షాలు మొదలవకముందే ఫీడర్, సప్లయ చానల్స్ పనులు పూర్తి చేయా లని డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె.వెంకటరత్నం ఆదేశించారు. శనివారం ఆయన బి.కొత్తకోట మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులను తనిఖీ చేశారు. పనులను పరిశీలించి కూలీల సమస్యలను ఆరా తీశారు. ఎండ, వేడి అధికంగా ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేయాలని కూలీలను కోరారు. కూలీలు వేతనాల చెల్లెంపుకు సంబంధించి ఇబ్బందులు పడవద్దని, సకాలంలో వేతనాలు అందుతాయని చెప్పారు. కూలీల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీఓ వెంకటేష్ ను ఆదేశించారు.
రాయచోటి టౌన్: బీసీల కులగణనను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిరవహించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వరావు డిమాండ్ చేశారు. సోమవారం డెడికేటేడ్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో గృహ గణన ఫార్మేట్‌లో ఓబీసీల గృహ గణన లెక్కించే కాలమ్ లేకపోవడం సరికాదన్నారు. రాజీవ్ రంజన్ మిశ్రా నాయకత్వంలో డెడికేటెడ్ కమీషన్ సుప్రీం కోర్టు ట్రిపుల్ టెస్ట్ ఆర్డర్‌లో సంతృప్తికరంగా అమలు జరిగేలా రాష్ట్రంలో బీసీల కులగణన ద్వారా డేటా సేకరించాలని కోరారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలు బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలన కేంద్రాలలో నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు.


