‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

May 24 2026 1:09 AM | Updated on May 24 2026 1:09 AM

‘బడి పిలుస్తోంది’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

మదనపల్లె సిటీ: బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి డాక్టర్‌ సుబ్రమణ్యం అన్నారు. శనివారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. బడిలో కొత్తగా విద్యార్థులను చేర్చుకునే కార్యక్రమంలో భాగంగా అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఎన్‌రోల్‌ మెంట్‌లో రాయలసీమలో జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. యూడైస్‌లో కనిపించని విద్యార్థుల వివరాలు సేకరించాలన్నారు. బడి తెరిచేలోపు అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్‌ అనూరాధ, డివైఈఓ లోకేశ్వరెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్‌, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

డీఈఓ డాక్టర్‌ సుబ్రమణ్యం

Advertisement
 
Advertisement
Advertisement