విద్యార్థి మృతి కేసులో అరెస్టు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి మృతి కేసులో అరెస్టు

May 24 2026 1:09 AM | Updated on May 24 2026 1:09 AM

మదనపల్లె టౌన్‌ : ఎంబీఏ విద్యార్థి అనుమానస్పద మృతి కేసులో శనివారం 2వ పట్టణ పోలీసులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఆఫీస్‌ సబార్డినేటర్‌ గోవర్ధన్‌ నాయక్‌ (28)ను అరెస్టు చేశారు. 2వ పట్టణ సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపిన వివరాల ప్రకారం, పుంగనూరు మండలం, పాలెం పల్లె పంచాయతీ, కుక్కలపల్లి గ్రామానికి చెందిన గంగరాజు కురబలకోట మండలం, అంగళ్లులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. గంగరాజు గత నెల 8వ తేదీన మదనపల్లె పట్టణం, ఇందిరా నగర్‌లో ఉంటున్న తన స్నేహితుడు గోవర్ధన్‌ నాయక్‌ ఇంటికి వచ్చాడు. గోవర్ధన్‌ నాయక్‌ మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సబార్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అదే రోజు రాత్రి గంగరాజు మిద్దైపె నుంచి కింద పడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం కావడంతో మృతుని కుటుంబ సభ్యులు టూ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సాక్ష్యారాలు సేకరించి, గోవర్ధన్‌ నాయక్‌ పాత్రపై అనుమానం రావడంతో శనివారం అతన్ని ఆర్టీసీ బస్టాండు వద్ద అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని సీఐ మహమ్మద్‌ రఫీ తెలిపారు.

అంధకారంలో జిల్లా ప్రభుత్వాసుపత్రి

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో రోగులు అరగంట పాటు అంధకారంలో కాలం వెళ్లదీశారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కరెంటు పోయింది. ఆ సమయంలో ఆస్పత్రికి ఉన్న జనరేటర్‌ పనిచేయకపోవడంతో ఆస్పత్రి అత్యవసర విభాగంతో పాటు వార్డుల్లో ఉన్న రోగులు, వారి అటెండర్లు చీకట్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

శ్రీవారి భక్తుడికి అస్వస్థత

ఒంటిమిట్ట : తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం తరిగి వస్తుండగా తెలంగాణకు చెందిన శ్రీవారి భక్తుడు ముత్తన్న(48) అస్వస్థతకు గురయ్యాడు. ఒంటిమిట్ట పీహెచ్‌సీ డాక్టర్‌ భావన తెలిపిన వివరాల మేరకు..తిరుమల శ్రీ వెంకటేశ్వర్వ స్వామి దర్శనం అనంతరం స్వస్థలానికి కారులో వెళుతున్న తెలంగాణ రాష్ట్రం, నిర్మల్‌ జిల్లా, బోడు గ్రామానికి చెందిన ముత్తన్న అనే వ్యక్తి ఒంటిమిట్ట సమీపంలోకి రాగానే అస్వస్థతకు గుర్రయ్యాడు. కాల్షియం లోపం ఉన్న ముత్తన్న గత రెండు రోజులుగా మందులు మింగకపోవడంతోనే ఈ సమస్య ఎదురైందనితెలిపారు,సకాలంతో చికిత్స అందించడం వల్ల ఆరోగ్యం మెరుగు పడటంతో కొద్ది సేపటికి ముత్తన్న అక్కడి నుంచి వెళ్లిపోయారన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement