నూతన నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన నియామకం

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

నూతన నియామకం అంబేద్కర్‌ గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ 25న డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ సమీక్ష నేటి నుంచి ఫుట్‌బాల్‌ జిల్లా జట్లు ఎంపిక మునిసిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ మృతి శాసీ్త్రయ సాగుతోనే అధిక దిగుబడులు

సాక్షి, మదనపల్లె: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు చెందిన నేతలను పార్టీ పదవుల్లో నియమిస్తూ శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శులుగా పీలేరు నియోజకవర్గానికి చెందిన పోతపు కేశవరెడ్డి, రాయచోటి నియోజకవర్గానికి చెందిన కురుమయ్య గారి రమేష్‌ రెడ్డి, పంచాయతీరాజ్‌ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మదనపల్లె నియోజకవర్గానికి చెందిన కోటూరి ఈశ్వర్‌, ఐటీ విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా రాయచోటి నియోజకవర్గానికి చెందిన ముండ్ల సంజీవరెడ్డి, రాజంపేట నియోజకవర్గానికి చెందిన జి.ప్రవీణ్‌ కుమార్‌ రాజులను నియమించారు.

మదనపల్లె సిటీ: ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఏపీఎస్‌డబ్యూఆర్‌ఈఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారిణి ఏ.ఉదయశ్రీ తెలిపారు. కడప చిన్నచౌక్‌లోని అంబేద్కర్‌ గురుకులంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఐదో తరగతి బాలికలకు ఈనెల 26న, బాలురకు 27న.. ఇంటర్‌ మొదటి ఏడాది బాలికలకు ఈనెల 29న, బాలురకు 30న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను ఎంపిక చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

మదనపల్లె సిటీ: డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా ఈనెల 25వ తేదీన వైఎస్సార్‌ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధికారులతో కడప కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి తెలిపారు. వెనుబడిన కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధా రణ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడప కలెక్టర్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు అందజేయాలన్నారు.

మదనపల్లె సిటీ: ఫుట్‌బాల్‌ సీనియర్‌, జూనియర్‌, సబ్‌ జూనియర్‌ జిల్లా జట్లు ఎంపిక ఈనెల 23, 24తేదీల్లో జరుగుతుందని జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషియన్‌ కార్యదర్శి మురళీధర్‌ తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల 23వతేదీ ఉదయం 9 గంటలకు సీనియర్‌ పురుషుల జట్లు ఎంపిక జరు గుతుందని పేర్కొన్నారు. 24వతేదీ ఉదయం 9 గంటలకు సబ్‌ జూనియర్‌, జూనియర్‌ కేటగిరీలో బాలబాలికల పుట్‌బాల్‌ జట్లు ఎంపిక జరుగుతుందన్నారు. వివరాలకు అబ్రహాం 89194 91555, బాలాజీ 8096607782 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

పుంగనూరు: మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ హజీ పి.వాహిదున్నిసా (76) శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఎంపీ మిథున్‌రెడ్డి బెంగళూరుకు తరలించి చికి త్స చేయిస్తున్నారు. అయితే బెంగళూరు వైదేహి ఆసుపత్రిలో ఆమె మృతి చెందారు. 1995–2000 వరకు పుంగనూరు మున్సిపల్‌ చైర్మన్‌గా ఆమె సేవలందించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి ఆమె మృతికి సంతాపం తెలిపారు. మాజీ చైర్మన్లు కొండవీటి నాగభూషణం, అలీమ్‌బాషా ఆమె భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు.

కురబలకోట: శాసీ్త్రయ పద్ధతులు, నూతన సాంకేతికతతోనే అధిక దిగుబడులు సాధ్యమని అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ అన్నారు. కనసానివారిపల్లి రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ఆయన, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అందాలంటే ’ఏపీఎఐఎంఎస్‌’ నమోదు తప్పనిసరన్నారు. అనంతరం పలు సూచనలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement