విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

పులిచెర్ల(కల్లూరు): కల్లూరు పులిచెర్ల మార్గంలోని జి.నూర్‌బాషా(55) ఇంటిలో దూదితో పరుపులు కుట్టి అమ్ముకుంటున్నాడు. ఈక్రమంలో శుక్రవారం విద్యుత్‌ మిషన్‌ సహాయంతో దూదిని బేళ్లనుంచి విడదీస్తుండగా విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌కారణంగా మంటలు చెలరేగాయి. దూది,మిషన్లు కాలిపోయాయి. అగ్నిమాపక శాఖ వారికి విషయం తెలియజేయడంతో వారు ఫైర్‌ ఇంజిన్‌తో మంటలను ఆర్పేసారు. ఏమేరకు నష్టం వాటిల్లిందో తెలియాల్సి ఉంది.

జోరుగా నిషేధిత

లాటరీ వ్యాపారం

పుంగనూరు: పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పుమొగసాల, సెంటర్‌లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్‌ఎస్‌.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చిన్నారి నోటికి చేపల గాలం

కలకడ : చేపలను పట్టేందుకు వేసే గాలం చిన్నారి బేబీ(2)కి ఆడుకునే బొమ్మలా అనిపించడంతో నోటిలో పెట్టుకుంది, దీంతో అదికాస్త నోటిలో చిక్కుకున్న సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన రవి దంపతులు కలకడ మండలం గుడిబండ సమీపంలో తాత్కాలిక షెడ్లు వేసుకుని నెల రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లోని ముళ్లపొదలు, కంపచెట్లు కొట్టి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి చిన్నారి షెడ్‌లో ఆడుకుంటూ చేపల గాలాన్ని నోట్లో పెట్టుకొని లాగడంతో ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా గాలం రాకపోవడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గాలం తీయడం కష్టతరమని భావించి తిరుపతికి రెఫర్‌ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement