పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్యాయత్నం | - | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరించారని ఆత్మహత్యాయత్నం

May 23 2026 1:22 AM | Updated on May 23 2026 1:22 AM

మదనపల్లె టౌన్‌: ప్రేమించిన వ్యక్తితో పాటు వారి తల్లి దండ్రులు తన పెళ్లికి నిరాకరించారని ఓ యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం చౌడేపల్లి మండలం, బోయకొండ షికారి పాల్యంలో చోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. షికారి పాలెంకు చెందిన శివయ్య ఏసమ్మల కుమార్తె శివాని (22) కర్ణాటక రాష్ట్రం, మైసూర్‌, మండియా జిల్లా, షికారిపురంలో తన మేనత్త దగ్గర ఉంటోంది. అక్కడ చదువుకునేది. ఈ క్రమంలో అదే ఊరికి చెందిన వస్తాద్‌, పప్పిల కుమారుడు రాఘవ(25)ను ప్రేమించింది. ఇద్దరూ కలిసి సహజీవనం చేసినట్లు ఆరోపించింది. ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, రాఘవ మాట మారుస్తున్నాడని తెలిపింది. ఈ విషయాన్ని తన మేనత్తతో చెప్పడంతో ఆమె తీసుకొచ్చి స్వగ్రామమైన బోయకొండలో తనను వదిలిపెట్టి వెళ్లి పోయిందని తెలిపింది. తనను మోసం చేసి పెళ్లికి రాఘవ, అతని తల్లి దండ్రులు నిరాకరించడంతో బోయకొండలో విషం తాగింది. కుటుంబీకులు బాధితురాలని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. చౌడేపల్లి పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

కుటుంబ సమస్యలతో..

మదనపల్లె టౌన్‌: కుటుంబ సమస్యల కారణంగా ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పెద్దతిప్ప సముద్రం మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలో కానుక మాకుల పందికొచ్చిందిన అజంతుల్లా కుమారుడు ఫయాజ్‌(27) సమస్యల కారణంగా మనస్థాపం చెంది పురుగుమందు తాగాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement