వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి
రాయచోటి అర్బన్ : తిరుపతిలో చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న రాయచోటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని శుక్రవారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరులు దశరథరామిరెడ్డిపై దాడికి పాల్పడి రెండు కాళ్లు, చేతులు విరగొట్టి ప్రాణాపాయ స్థితికి చేర్చారని ఆరోపించారు. ఘటన జరిగి 19 రోజులు గడిచినా ఇప్పటికి నిందితులను గుర్తించి అరెస్ట్ చేయకపోవడం వెనుక కారణమేంటని ప్రశ్నించారు. పోలీసులు అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనుకాకుండా వెంటనే నిందితులను అరెస్టు చేయాలయన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు, రోజు రోజుకూ పెరుగుతున్నాయని మండిపడ్డారు. దశరథరామిరెడ్డికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాయలసీమ విద్యాసంస్థల అధినేత ఆనంద రెడ్డి , సంబేపల్లె మండల వైఎస్సార్‌సీపీ నాయకులు వీవీ ప్రతాప్ రెడ్డి, మాజీ సర్పంచ్ దండు నాగభూషణ రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా విద్యార్థి సంఘం అధ్యక్షులు జంగం రెడ్డి కిషోర్ దాస్ తదితరులు పాల్గొన్నారు.


