మదనపల్లె టౌన్: పీజీఆర్‌ఎస్ అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పసరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ప్రజలు మొత్తం 392 అర్జీలను కలెక్టర్‌కు సమర్పించారు.వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజల నుంచి అందిన అర్జీల్లో కొన్ని..
● మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డి లేఔట్‌కు చెందిన లక్ష్మిదేవి తన భర్త మరణించి రెండేళ్లు అయిందని, కుటుంబం గడవటం కష్టంగా మారింది. పీఆర్‌ఎస్‌లో కలెక్టర్‌కు అర్జీ అందజేసింది. తనకు పెన్షన్ ఇప్పించండయ్యా అంటూ విజ్ఞప్తి చేసింది.
● భర్త, పిల్లలు మరణించడంతో నలుగురు మనవ ళ్లను పోషించుకుంటూ కాలం వెలదీస్తున్న తనకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలి. తన మన వ ళ్లను రోషన్ కార్డులో చేర్చాలని కురబబల కోట మండలం, తెట్టు పూజారివారిపల్లెకు చెందిన గు ర్రాల వెంకటటలక్ష్మీ కలెక్టర్ కు అర్జీ అందజేసింది.
● తంబళ్లపల్లెకు చెందిన ఎల్లప్పకు కాలు లేదు. నడవ లేని తనకు పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకున్నాడు.
● మదనపల్లె మెప్మా ఆర్పిలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆర్పీలు నిరసన తెలిపారు. 2007 నుంచి 70 మంది రూ.8 వేల జీతంతోనే సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ కస్టాన్ని గుర్తించి, పనికి తగ్గ వేతం రూ.24 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
వెబ్ ల్యాండ్ సమస్యలకు చెక్
అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెడింగ్‌లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఏళ్లుగా పరిష్కరారం కాని రైతుల వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించి సోమవారం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇద్దరు రైతులకు మదనపల్లె కలెక్టరేట్‌లో వన్–బి పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాత రికార్డులను పరిశీలించి గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ల సవరణలు, కొత్త సర్వే నెంబర్ల చేర్పులు, అడంగల్ వివరాలను సరిదిద్దడం, వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఊరట ఇప్పుడు లభించిందన్నారు. భూ రికార్డులను సరిగా ఉంచడంతో రైతులకు అత్యంత కీలకమైన పంట రుణాలు, భూ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి వాటికి ఉపయోగ పడతాయన్నారు. మిగిలిన ధరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరిస్తామని తెలిపారు. రెవిన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


