కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పెంపు

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

మదనపల్లె సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్‌, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను(కేజీబీవీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుకునే అవకాశం ఉంది. జిల్లాలో 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680 సీట్లు, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 680 ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు. 6వ తరగతిలో ఇప్పటివరకు 1252 మంది నుంచి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో 1348 మంది నుంచి దరఖాస్తులు అందాయి. జిల్లాలోని కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 10వతేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వతేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కేజీబీవీల్లో 40 సీట్లు చొప్పున 680 సీట్లు ఇంటర్‌ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున 680 సీట్లు ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా...

అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ.ఏపీ.సీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఇన్‌)వెబ్‌ౖసైట్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు వారి రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్లకు ఎస్‌ఎంఎస్‌ ద్వారా సమాచారం పంపుతారు. ఎంపిక జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారు.

పారదర్శకంగా ఎంపిక

జిల్లాలోని కేజీవీవీల్లో అడిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీడీ ఆదేశాల మేరకు ఈనెల 20వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు.ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

– డాక్టర్‌ ఎన్‌.అనురాధ, ఏపీసీ, సమగ్రశిక్ష శాఖ

Advertisement
 
Advertisement
Advertisement