కోదండరామాలయం ప్రభుత్వ ఆధీనంలోకి చర్యలు | - | Sakshi
Sakshi News home page

కోదండరామాలయం ప్రభుత్వ ఆధీనంలోకి చర్యలు

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

పుంగనూరు : పట్టణంలోని నాగపాళెంలో వెలసిన శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవదాయశాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్‌ తెలిపారు.

సోమవారం ఆయన స్థానిక గ్రూపు టెంపుల్స్‌ కార్యనిర్వాహణాధికారి రమణ, దేవస్థాన సిబ్బందితో కలసి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను పరిశీలించారు. త్వరలోనే ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement