విషతుల్య మేత తిని 40 గొర్రెల మృతి | - | Sakshi
Sakshi News home page

విషతుల్య మేత తిని 40 గొర్రెల మృతి

Apr 14 2026 7:34 AM | Updated on Apr 14 2026 7:34 AM

గాలివీడు : మండల పరిధి నూలివీడు గ్రామంలోని టౌన్‌ సచివాలయం సమీపంలో పాడి రైతు ఆదినారాయణ చెందిన 40 గొర్రెలు మృతి చెందినట్లు డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ మాలకొండయ్య, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం విషతుల్యమైన మేత తినడం వల్ల గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం మృతి చెందిన గొర్రెల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. పొలాల వద్ద మేపు కోసం పశువులను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోవడం బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్‌ ఉమాపతిరెడ్డి గొర్రెల రైతును పరామర్శించి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యుడు నాగరాజు, ఎల్‌ఎస్‌ఏలు సురేష్‌, ఆకాష్‌ తేజ, ఖాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement