అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

ఒంటిమిట్ట : మండలపరిధిలోని పెద్దకొత్తపల్లిలో శనివారం పలుకూరు మురళి(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు...మురళి తనకున్న భూమితో పాటు ఇతరులకు చెందిన భూములు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాల్లో చామంతి సాగుచేశాడు. పూలకు గిట్టుబాటు ధరలేక నష్టం వచ్చింది. అప్పుల భారం పెరిగింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక పొలంలోనే విషద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మురళిని 108 సహాయంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్‌ అసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, నలుగురు సంతానం ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement