ఇరు వర్గాల మధ్య ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల మధ్య ఘర్షణ

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె మండలంలోని గుడిసివారిపల్లెలో ఆదివారం రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలోఅన్నా చెల్లెలు కత్తిపోట్లకు గురైయ్యారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, గుడిసివారిపల్లెకు చెందిన ఏ.పవన్‌ కుమార్‌(30), అతని చెల్లెలు ఏ.భవాని (25) లకు అదే ఊరికి చెందిన అన్నదమ్ములు నవీన్‌. అనూప్‌ వర్గానికి పాత గొడవలు ఉన్నాయి. ఆదివారం ఇరు వర్గాలు మాటామాట పెంచుకుని దూషణలకు దిగారు. ఈ గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై మరొకరు కర్రలు, కత్తులతో పర్సపర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో అన్నా చెల్లెలు పవన్‌ కుమార్‌, భవాని కత్తి పోట్లకు గురికాగా పవన్‌కుమార్‌ తల్లి అంజమ్మ, మేన మామ రెడ్డెప్ప లపై ప్రత్యర్థులు నవీన్‌, అనూప్‌ లు కర్రలు, కత్తులతో దాడులు చేశారని తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి పవన్‌ కుమార్‌, అతని చెల్లెలును తిరుపతికి రెఫర్‌ చేశారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నవీన్‌ బైక్‌ను పవన్‌ కుమార్‌ వర్గీయులు తగల బెట్టడంతో మంటల్లో కాలి పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అన్నా చెల్లెలుకు కత్తి పోట్లు

Advertisement
 
Advertisement
Advertisement