ఉత్సాహంగా టీ20 మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా టీ20 మ్యాచ్‌లు

Apr 13 2026 7:32 AM | Updated on Apr 13 2026 7:32 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: టీ20 మ్యాచ్‌లు ఉత్సాహంగా జరిగాయి.ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో అనంతపురం, కడప జట్లు విజయం సాధించాయి. వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్‌లో చిత్తూరు–అనంతపురం జట్లు తలపడ్డా యి. టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌ ఎంకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని పృధ్వీరాజ్‌ 42, ధరణికుమార్‌ నాయుడు 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్‌ 2, ప్రమోద్‌కుమార్‌ 2, ఎస్‌ఎండీ కమిల్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 19.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్‌ రోన్‌ 74, విజయ్‌కుమార్‌ 38 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్‌ 5 వికెట్లు తీశాడు. గిరిష్‌ కుమార్‌ రెడ్డి 2, దీపన్‌ సాయినాఽథ్‌ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో అనంతపురం జట్టు 1 వికెట్‌ తేడాతో విజయం సాధించింది.

● వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో మధ్యా హ్నం జరిగిన మ్యాచ్‌లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్‌రెడ్డి 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. జయవర్దన్‌ 58, ధనుష్‌ 45 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్‌కె కమరుద్దీన్‌ 2, ఆంజనేయులు 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆ జట్టులోని గిరినాఽథ్‌ 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. కరణ్‌ షిండే 84 పరుగులు చేశాడు,కడప జట్టులోని సుదర్శన్‌ 2, ఆరిష్‌ భాష 1, మహ్మద్‌ రఫీ 1 తీశారు. దీంతో కడప జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.

అనంతపురం, కడప జట్ల విజయం

Advertisement
 
Advertisement
Advertisement