నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొలచిన విగ్రహం కాదు. మధ్యప్రదేశ్‌లోని నర్మద నదిలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని గజ ఈతగాళ్లతో వెలికి తీసి తెప్పించారు. ఈ విగ్రహానికి రూ.4 లక్షలకు పైగా వెచ్చించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. సాలేగ్రామ్ విగ్రహం కావడంతోపాటు స్వయంభుగా వెలిసినట్లు తెలుస్తోంది. మధ్యలో ఎరుపు రంగు ఉండి మిగతాదంతా తెల్ల రంగుతో ఉండటం విశేషం. మాములుగా శివలింగం అంటేనే నలుపు రంగులో ఉండటం సహజం. నర్మద నది శివలింగాలకు పుట్టినిల్లని ప్రతీతి. మిగతా వినాయకుడు, పార్వతీదేవి విగ్రహాలను టీటీడీ నుంచి తెప్పించారు. ప్రధాన ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నంది విగ్రహం ఆళ్లగడ్డలో తయారు చేయించారు.


