అడ్డొచ్చిన కుక్క.. అదుపు తప్పిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

అడ్డొచ్చిన కుక్క.. అదుపు తప్పిన బైక్‌

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

మదనపల్లె టౌన్‌ : కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి పడి బోరు మెకానిక్‌ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకాడపల్లెకు చెందిన నాగరాజు(24) మదనపల్లెలోని ఓ బోర్‌ మెకానిక్‌ దుకాణలో మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రోజూ విధులకు మదనపల్లెకు బైకులో వచ్చి పోయేవాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం మదనపల్లెకు వచ్చిన నాగరాజు విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో బండకాడపల్లెకు బైకుపై వెళుతుండగా, మార్గంమధ్యలోని నాయునివారిపల్లె మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి కింద పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement