మనస్తాపంతో యువతి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

Apr 12 2026 3:12 AM | Updated on Apr 12 2026 3:12 AM

మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి జయవాణి(29) మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపరాల గ్రామం కొత్త కొట్టాలలో జయరాముడు, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో జయవాణి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనను గమనించిన తండ్రి జయరాముడు వెంటనే ఆమెను జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement