కురబలకోట : కురబలకోట ఎంపీపీ ఎంజీ భూదేవి కుమారుడు ఎంజీ అభిషేక్ (20) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇతను అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. మండలంలోని విశ్వం కళాశాల సమీపంలో బైక్‌పై వెళుతుండగా గురువారం కారు ఢీకొంది. ఈ సంఘటనలో అభిషేక్‌కు గాయాలు కాగా మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చెట్టుపై నుంచి పడి..
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : చింత కాయలు కోయడానికి వెళ్లిన రైతు చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ఘటనపై జల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లె మండలం గారబురుజుకు చెందిన రైతు ఖలీల్ (58) ఊరి సమీపంలోని తన చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా, కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు.
రోడ్డు ప్రమాదంలో
రైతుకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : నీళ్ల ట్యాంకర్‌ను తప్పించబోయిన ఓ రైతు రోడ్డు పక్కనున్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పెంచుపాడు పంచాయతీ కట్టుబావి గొల్లపల్లెకు చెందిన రైతు గుణశేఖర్ (40) సొంత పని మీద మదనపల్లెకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి అదే రోజు రాత్రి స్వగ్రామానికి బైకుపై వస్తుండగా, మార్గంమధ్యలోని బంగోళ్లపల్లె దగ్గర ఎదురుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్‌కు సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని ట్యాంకర్ డ్రైవర్, స్థానికులు గుర్తించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించి, వెంటనే తిరుపతి రుయాకు వెళ్లాని రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తాలుకా పోలీసులు తెలిపారు.


