● రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

● రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

Apr 10 2026 10:15 AM | Updated on Apr 10 2026 10:15 AM

● రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి

సాక్షి నెట్‌వర్క్‌: వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకుని మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్‌ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు నిరసిస్తూ వైఎస్సార్‌ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు ఇచ్చారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. బద్వేల్‌ అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను చిత్రపటానికి చెప్పుల దండ వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అబద్దాలన్నీ టీడీపీ నాయకులు విన్నారు కాబట్టి వారంతా వెన్నెముక లేనివారేనని అనుకోవాలా...అని అన్నారు. కమలాపురంలో నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ విద్యాసాగర్‌కు ఫిర్యాదు చేశారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement