హత్యకేసులో నలుగురు అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

హత్యకేసులో నలుగురు అరెస్ట్‌

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

చౌడేపల్లె: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త ఉండగా పరాయిమగాడి మోజులో పడి ఈనెల 5న బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం వద్ద రాళ్లు, కట్టెలతో కొట్టి గాంఽధీని హతమార్చిన ఘటనలో నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సర్కిల్‌ కార్యాలయంలో సీఐ సాయిప్రసాద్‌, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్పలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం తాలూకా కోసవంపుధూర్‌ఇరులర్‌ కాలనీకి చెందిన జి. గాంధీ(37) అతని భార్య రాసాతితో కలిసి ఊటూరు వద్ద గల ఓ కోళ్లఫాంలో కూలీపనులకోసం వచ్చారు. రాసాతి బోయకొండ ఆర్‌ఆర్‌కాలనీకి చెందిన నరసింహులు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈక్రమంలో భార్యను భర్త పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. రాసాతి ప్రియుడితో సహజీవనం చేస్తుండేంది. స్వగ్రామానికి వెళ్ళిపోయిన గాంధీ పదిరోజులక్రితం ఆర్‌ఆర్‌కాలనీకి వచ్చాడు.తన వెంట రమ్మని రాసాతిని బతిమలాడారు. ప్రియుడి మోజులో ఉన్న రాసాతి ఆమె ప్రియుడు నరసింహులు,అతని తమ్ముళ్లు లక్ష్మిపతి,నాగరాజఅలియాస్‌ నాగులు కలిసి పథకం ప్రకారం మద్యం తాపించి గాంధీను రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. మృతుడి కుమారుడు సందీప్‌ అంగన్‌వాడీ టీచర్‌కు జరిగిన ఘటనను వెల్లడించడంతో హత్య ఉదంతం బయటపడింది. మృతుడి సోదరుడు సురేష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్ట్‌చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.

అనాథగా మిగిలిన చిన్నారి

గాంధీ హత్య విషయం బయటకు రావడానికి మృతుడి కుమారుడు సందీప్‌ కీలకమయ్యాడు. ఈ కేసులో రాసాతి ప్రియుడి మోజులో పడి నేరంలో భాగస్వామి కావడంతో కటకటలాపాలైంది. చివరికి ఐదేళ్ల సందీప్‌ అనాథగా మిగలడం కంట తడి పెట్టించింది.

Advertisement
 
Advertisement
Advertisement