నెల్లూరు, అనంతపురం జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

నెల్లూరు, అనంతపురం జట్ల విజయం

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

రోషన్‌ పవన్‌కుమార్‌రెడ్డి, 72 పరుగులు

హానీష్‌ వీరారెడ్డి,

74 పరుగులు

సుబ్రమణ్యం,

4 వికెట్లు

సాయి సూర్యతేజరెడ్డి, 85 పరుగులు

రేవంత్‌రెడ్డి,

71 పరుగులు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌: ఏసీఏ సౌత్‌జోన్‌ సీనియర్స్‌ మెన్‌ టీ20 మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. బుధవారం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ఉదయం జరిగిన టీ20 మ్యాచ్‌లో కర్నూలు–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 85, నయిముల్లా 29 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుబ్రమణ్యం 4, సాకేత్‌ రామ్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 18.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. జట్టులోని రేవంత్‌రెడ్డి 71, రోషన్‌ పవన్‌కుమార్‌ 72 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్‌కె కమరుద్దీన్‌ 2 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. 20 ఓవర్లలో 167 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని ధనుష్‌ 55, ధృవకుమార్‌రెడ్డి 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వినయ్‌కుమార్‌ రెడ్డి 2, దీపక్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన అనంతపురం జట్టు 11.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. ఆ జట్టులోని హానీష్‌ వీరారెడ్డి 74, దత్తరెడ్డి 43 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆరిఫ్‌ భాష 3 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement
 
Advertisement
Advertisement