స్వల్పంగా పెరిగిన టమాట ధర | - | Sakshi
Sakshi News home page

స్వల్పంగా పెరిగిన టమాట ధర

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

స్వల్పంగా పెరిగిన టమాట ధర డ్రోన్‌ కెమెరాలతో నిఘా క్రైం పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించిన ఎస్పీ

మదనపల్లె: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం టమాట ధరలు స్వల్పంగా పెరిగాయి. ఒకటవ రకం కిలో రూ.11.50 నుంచి రూ.13, రూ.14 పలగ్గా, రెండో రకం కిలో ధర రూ.9 నుంచి రూ.10, రూ.11 పలికింది. విక్రయానికి 157 టన్నుల టమాట వచ్చింది. వివిధ ప్రాంతాలకు ఎగుమతి అయ్యింది.

మదనపల్లె టౌన్‌: అసాంఘిక శక్తులపై డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెట్టినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. జిల్లాలోని అసాంఘీక శుక్తుల ఆట కట్టించేందుకు పోలీస్‌ యంత్రాంగం సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంది. నేరస్థులు ఏ పొదలో దాక్కున్నా.. పసిగట్టేలా డ్రోన్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్నారు. నేరం చేసినోడు తప్పించుకోవడం అసాధ్యం అన్నట్లుగా డ్రోన్‌ కెమెరాలతో నిఘా పెంచామని ఎస్పీ తెలిపా రు.హైటెక్‌ గస్తీలతో నేరస్థుల గుండెళ్లో రైళ్లు పరిగెత్తేలా పోలీసులు పనిచేసి ప్రజలకు నమ్మ కా న్ని కలిగించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు.

మదనపల్లె టౌన్‌: అన్నమయ్య జిల్లాలో శాంతి భద్రల పరిరక్షణతో పాటు పెండింగ్‌లో ఉన్న, క్లిష్టమైన నేర పరిశోధనలను త్వరితగతిన కొలిక్కి తెచ్చేందుకు బుధవారం మదనపల్లెలో క్రైం పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించినట్లు ఎస్పీ ధీరజ్‌ కునుబిల్లి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె బి.టి కళాశాల ఆవరణలో క్రైం పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయడంవల్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి, చోరీల కేసు ఛేదించడానికి వీలు ఉంటుందని తెలిపారు. క్రైం సీఐ చంద్ర శేఖర్‌ మాట్లాడుతూ టెక్నాజీని వాడుకుంటూ నేరస్థులను ఎప్పటికప్పుడు పట్టుకుని, అరెస్టు చేసి శిక్షించడానికి సిబ్బంది సహకారం ఎంతో అవసరం ఉందని చెప్పారు. సీఐలు రాజారెడ్డి, కళా వెంకటరమణ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఆదినారాయణ రెడ్డి, రెడ్‌ శాండి టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌ కుమార్‌, ఎస్‌ఐలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement