సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

Apr 9 2026 7:53 AM | Updated on Apr 9 2026 7:53 AM

సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం

పెద్దమండ్యం: సచివాలయ సేవల్లో పారదర్శకతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. మండలంలోని కోటకాడపల్లె గ్రామ సచివాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నిర్వహణ, వినతులు–ఫిర్యాదుల పరిష్కార విధానాన్ని కలెక్టర్‌ సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సిబ్బంది ఫేషియల్‌ హాజరు విధానాన్ని సిబ్బంది తప్పనిసరిగా పాటించాలన్నారు. ఈ విధానాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే ప్రజలకు అందించే సేవలలో పారదర్శకత, బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. సచివాలయ సేవలు ప్రజలకు సులభంగా, వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ రికార్డులను సక్రమంగా నవీకరించాలని అధికారులకు సూచించారు. ఇంటి పన్నులు, చెత్త సేకరణ, పశువైద్యం, రైతులకు ఎరువుల పంపిణీ, పక్కాగృహాల నిర్మాణం, పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన భూసమస్యల పరిష్కారంపై ఎంపీడీఓ, తహశీల్దార్‌, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌వోలతో మట్లాడారు. తహసీల్దార్‌ తేజస్వి, ఎంపీడీఓ శ్రీధర్‌రావు, హౌసింగ్‌ ఏఈ అక్రం, వీఆర్‌వోలు మంజునాథ రెడ్డి, ఆంజినేయులునాయక్‌, పంచాయతీ కార్యదర్శులు పి జగన్‌మోహన్‌, జనార్దన్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement