మదనపల్లె: గతేడాది డిసెంబర్‌లో కొత్తగా జిల్లాల చేర్పులు, మార్పులతో జిల్లాల సరిహద్దులు మారిపోయాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న 26 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయగా ఆ రోజునుంచి మనుగడలోకి వచ్చాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేయగా, అన్నమయ్య జిల్లా రూపురేఖలను మార్చేసింది. ఒకజిల్లాలోని నియోజకవర్గాలను మూడుజిల్లాల్లో కలిపింది. దీంతో జిల్లా సరిహద్దులు మారిపోయాయి. రాష్ట్రంలో ఏడు జిల్లాల సరిహద్దు కలిగిన ఏకై క జిల్లాగా వైఎస్సార్ కడపజిల్లా నిలిచింది. ఈ జిల్లాకు గతంలో తిరుపతిజిల్లా సరిహద్దుగా ఉండేదికాదు. అన్నమయ్యలోని రైల్వేకోడూరును తిరుపతిలోకి, రాజంపేటను వైఎస్సార్‌కడపజిల్లాలోకి కలపడంతో సరిహద్దు మారింది. దాంతో వైఎస్సార్‌కడపజిల్లాకు చుట్టూ అన్నమయ్య, తిరుపతి, మార్కాపురం, నెల్లూరు, సత్యసాయి, అనంతపురం, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. వైఎస్సార్ కడపజిల్లా రాయలసీమ నడిబొడ్డను ఉండటంతో ఇలా ప్రాధాన్యత దక్కింది. అన్నమయ్యజిల్లాకు చిత్తూరు, వైఎస్సార్‌కడప, సత్యసాయి, తిరుపతిజిల్లాలు, కర్ణాటక సరిహద్దుగా ఉన్నాయి.
అన్నమయ్యకు నాలుగుజిల్లాల సరిహద్దు


