జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

Apr 6 2026 8:06 AM | Updated on Apr 6 2026 8:06 AM

జగ్జీవన్‌రామ్‌ సేవలు చిరస్మరణీయం

మదనపల్లె: స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ శివ్‌ నారాయణ్‌ శర్మ అన్నారు. ఆదివారం కలెక్టరేట్లో జగ్జీవన్‌ రామ్‌ 119వ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి, పార్లమెంట్‌ సభ్యుడిగా మూడు దశాబ్దాలకుపైగా సేవ చేశారని చెప్పారు. అణగారిన కులాలకు అభ్యున్నతి కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుసూదనరావ్‌, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి దామోదర్‌ రెడ్డి, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ శాఖల అధికారులు, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్‌ వై.సుదర్శనం, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

జేసీ శివ్‌ నారాయణ్‌ శర్మ

Advertisement
 
Advertisement
Advertisement