మదనపల్లెలో రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు.. | - | Sakshi
Sakshi News home page

మదనపల్లెలో రెచ్చిపోతున్న బైక్‌ రేసర్లు..

Apr 5 2026 7:48 AM | Updated on Apr 5 2026 7:48 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లెలో బైక్‌ రేసర్లు రెచ్చి పోతున్నారు... కట్టడి చేయల్సిన పోలీసులు చేష్టలుడిగారు. ప్రతి రోజు మైనర్లు, స్థానికంగా ఉన్న కొందరు యువకులు సైలెన్సర్లు తొగించి బైకులపై పెద్ద శాబ్దాలతో పుర వీధుల్లో స్పీడుగా తిరుగుతున్నారు. పురప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నా.. జిల్లా ఎస్పీ,గానీ, స్థానిక పోలీసులు గానీ బైక్‌ రేసర్లను పట్టించుకోక పోడంతో విచ్చలవిడి తనంతో బైకులు నడిపి శనివారం స్థానికంగా ఉన్న దీక్షిత్‌ అనే బాలుడి కాలు విరిగి పోయిందని సీపీఐ అన్నమయ్య జల్లా సహాయ కార్యదర్శి క్రిష్ణప్ప తెలిపారు. ఎవరైనా చస్తేగానీ పోలీసులు స్పందించరా..? అని ప్రశ్నించారు.కాలు విరిగిన బాధిత బాలుడితో కలసి సోమవారం కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయల ఎదుట ధర్నా చేయనున్నట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ భూమి కబ్జా

పుంగనూరు : మండలంలోని గుడిసెబండ గ్రామానికి చెందిన సర్వే నంబరు: 291/3లో గల రూ.2 కోట్లరూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని క్వారీ యజమాని కబ్జా చేశాడు. కొంత మంది రెవెన్యూ అధికారులు అవినీతి అక్రమాల ఫలితమే కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని బాహాటంగా కబ్జా చేశారు. శనివారం భూమి వద్ద ఉన్న క్వారీ యజమాని వెంకటేష్‌ ప్రభుత్వ భూమి 2.50 ఎకరాల భూమిని జేసీబీలతో చదును చేసి క్వారీలోకి కలుపుకున్నాడు. దళిత సంఘ నాయకులు రాజు, పెంచుపల్లి కృష్ణప్ప తదితరులు ఆప్రాంతాన్ని సందర్శించి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాజు మాట్లాడుతూ సదరు స్థలాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఇళ్ల పట్టాలకు మంజూరు చేయాలని పలుమార్లు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. కానీ రెవెన్యూ వారు పట్టించుకోకుండా క్వారీ యజమానితో లాలూచి పడటంతో కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని దర్జాగా కబ్జా చేశారని ఆరోపించారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్‌ తక్షణమే విచారణ జరిపి, ప్రభుత్వ భూమిని కాపాడాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.

బైక్‌రేసర్లు ఢీకొట్టడంతో కాలు విరిగి

ఆస్పత్రి పాలైన బాలుడు..

Advertisement
 
Advertisement
Advertisement