కల్లూరు మాజీ సర్పంచ్‌ వైఎస్సార్‌సీపీలో చేరిక | - | Sakshi
Sakshi News home page

కల్లూరు మాజీ సర్పంచ్‌ వైఎస్సార్‌సీపీలో చేరిక

Apr 4 2026 7:55 AM | Updated on Apr 4 2026 7:55 AM

పులిచెర్ల(కల్లూరు): కల్లూరు మాజీ సర్పంచ్‌ ఎస్‌.షుకూర్‌ తన అనుచరులతో కలిసి శుక్రవారం మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తిరుపతిలో ఆయన స్వగృహంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ కండువాకప్పి పెద్దిరెడ్డి ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తానని ఈసందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధం

మదనపలె టౌన్‌: ఎలక్ట్రిక్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో లారీ దగ్ధమైన సంఘటన మదనపల్లెలో శుక్రవారం జరిగింది. ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలాలా.. మదనపల్లె పుంగనూరురోడ్డు, బసినికొండ బైపాస్‌ రోడ్డులో ఉంటున్న అమీన్‌ మెకానిక్‌ లారీ షెడ్డులో నిలిపి ఉన్న12 చక్రాల లారీలో వేకువ జామున ఎలక్ట్రిక్‌ వైర్లలో షార్ట్‌ సర్క్యూట్‌ ఏర్పడి మంటలు చెలరేగినట్లు సమాచారం అందిందన్నారు. వెంటనే సిబ్బందితో వెళ్లి మంటల్లో కాలిపోతున్న లారీపై నీళ్లు పోచి మంటలు పక్కనే ఉన్న ఇతర లారీలకు వ్యాప్తి కాకుండా అదుపులోకి తీసుకు వచ్చామని తెలిపారు. అయితే అప్పటికే లారీ 50 శాతంకు పైగా కాలిపోవడంతో సుమారు రూ.9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారి తెలిపారు. లారీ షెడ్డు యజమాని అమీన్‌ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement