జీఎస్టీ వసూళ్లపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ వసూళ్లపై దృష్టి సారించాలి

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

మదనపల్లె అర్బన్‌: జిల్లా ఖజానా ఆదాయం పెంపే లక్ష్యంగా అన్నిశాఖల అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశపు హాలులో ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రవాణా, మైనింగ్‌, రిజిస్ట్రేషన్‌, అటవీ, పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ శాఖలతో ఆదాయ సాధన పురోగతి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో పన్నుల వసూళ్లలో పారదర్శకత, సమర్థత పెంపుతో పాటు ఆదా య వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేయాలన్నా రు. ముఖ్యంగా మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ పను ల్లో జీఎస్టీ వసూళ్లు తప్పనిసరిగా జరిగేలా చూడాలన్నారు. అలాగే బిల్లులు ప్రాసెస్‌ చేసే సమయంలో జీఎస్టీ యాక్టీవ్‌ స్థితిని పరిశీలించాలని సూచించారు. అదేవిధంగా జిల్లాలో జరిగే పనులకు ఉపయోగించే ఇంధనాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. మైన్స్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, రవాణా, అటవీ శాఖల లావాదేవీలను క్రమబద్ధంగా నమోదు చేసి పన్నుల వసూళ్లను మరింత పెంచాలని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది రెవెన్యూ వృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందించాలంటూ కలెక్టర్‌ పిలుపునిచ్చారు. ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.

మౌళిక సదుపాయాలకు ప్రాధాన్యత

తంబళ్లపల్లె: గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీలు, మౌళిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ అన్నారు. గురువారం తంబళ్లపల్లె మండలంలో పర్యటించారు. స్థానిక శ్రీనివాసకాలనీలో రూ.36 లక్షల వ్యయంతో చేపట్టిన రోడ్లు, కాలువల నిర్మాణ పనులను పరిశీలించారు. గత 45 రోజుల్లో జిల్లాలో రూ.37 కోట్ల అంచనాతో 92 కిలోమీటర్ల కొత్త రహదారుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు మంజూరైనట్లు తెలిపారు. రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సంఘం (పీఎఫ్‌ఓ) కేంద్రాన్ని పరిశీలించారు. రైతుల నుంచి నేరుగా హార్టికల్చర్‌ పంటలను సేకరించి గ్రేడింగ్‌, నాణ్యమైన ప్యాకింగ్‌ చేసి మార్కెటింగ్‌ చేయాలన్నారు. పంచాయతీరాజ్‌ ఈఈ చంద్రశేఖర్‌, హార్టికల్చర్‌ అధికారిణి సుభా షిణి, డీపీఓ రాధమ్మ, తహశీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీఓ బాపూజీపట్నాయక్‌, ఎంఈఓ త్యాగరాజు, డీఈ మునిరాజ, జేఈ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ నిషాంత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement