అంగన్వాడీ ఆయాపై అత్యాచార యత్నం | - | Sakshi
Sakshi News home page

అంగన్వాడీ ఆయాపై అత్యాచార యత్నం

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో పని చేస్తున్న అంగన్వాడీ ఆయా పై అదే గ్రామానికి చెందిన రిపోర్టర్‌ చంద్ర దాడి చేసి అత్యాచారయత్నానికి ఒడి గట్టాడు. గురువారం గ్రామంలో ఉన్న ఆయాను లైంగికంగా వేధిస్తుండగా బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో భర్త, మామ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్‌కు తీసుకెళ్లారు. గతంలో కూడా ఈమైపె పలుమార్లు లైంగిక దాడగికి ప్రయత్నించడం, సదరు మహిళ ప్రతిఘటించడం పోలీస్‌ స్టేషన్‌లో ఫిద్యాదు చేయడం జరిగాయి. ప్రస్తుతం అదే కేసు నడుస్తున్నప్పటికీ తిరిగి లైంగిక దాడికి పాల్పడడం పై గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతుండటంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన రిపోర్టర్‌ ఇలాంటి అఘాయిత్యాలకు ఒడి గట్టడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్ర పై తక్షణం పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement