ములకలచెరువు: ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ యార్డులో 15 కేజీల టమాట బాక్సులు అమలు చేయాలని మార్కెటింగ్ జేడీ రామాంజులు ఆదేశించారు. గురువారం ఆయయ ములకలచెరువు మార్కెట్‌యార్డును సందర్శించి వేలం పాటలను పరిశీలించారు. అనంతరం మండీ యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుర్రంకొండ, మదనపల్లి మార్కెట్‌యార్డుల్లో 15 కేజీల టమాట బాక్సులు అమలు చేయించామని, ఇక్కడ కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా జాక్‌పాట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పారు. జాక్‌పాట్ విధానం అమలు చేసే మండీ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.


