లేగ దూడల సంరక్షణకు శ్రద్ధ చూపాలి | - | Sakshi
Sakshi News home page

లేగ దూడల సంరక్షణకు శ్రద్ధ చూపాలి

Mar 27 2026 8:48 AM | Updated on Mar 27 2026 8:48 AM

లేగ దూడల సంరక్షణకు శ్రద్ధ చూపాలి

కలికిరి: పాడి రైతులు లేగ దూడల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జి.గుణశేఖర్‌ పిళ్లై అన్నారు. మండలంలోని గుండ్లూరులో గురువారం రాష్ట్రీయ గోకుల మిషన్‌, రాష్ట్రీయ పశుగణాభివృద్ధి సంస్థ, పశుసంవర్ధకశాఖల ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన, పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం లేగ దూడల ప్రదర్శనకు హాజరైన పాడి రైతులకు ప్రోత్సాహక బహుమతులను అందచేశారు. కలికిరి ప్రాంతీయ పశువైద్యశాల సహాయ సంచాలకులు డా. కె.వెంకటమునినాయుడు, పశువైద్యాధికారులు గిరినాథ్‌రెడ్డి, జగన్‌మోహన్‌ రెడ్డి, కీర్తి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement