రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Mar 24 2026 7:52 AM | Updated on Mar 24 2026 7:52 AM

– ఒకరి పరిస్థితి విషమం

కలికిరి: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రగాయాలపా లు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... కందూరుకు చెందిన అల్తాఫ్‌ తన ద్విచక్రవాహనంలో సోమవారం రాత్రి పెట్రోల్‌క్యాన్‌తో కలికిరి నుంచి కందూరుకు వెళుతున్నాడు. అదే సమయంలో కందూరుకు చెందిన బావాజీ, పుంగనూరుకు చెందిన అప్సాన్‌ ద్విచక్రవాహనంలో కలికిరి వైపు వస్తున్నారు. కలికిరి సమీపం సామకుంటవారిపల్లి బస్టాప్‌కు కొంతదూరంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. అల్తాఫ్‌ వద్దనున్న పెట్రోలు క్యాను పగలడంతో వాహనాల వేడిమికి మంటలు వ్యాపించాయి. అల్తాఫ్‌కు మంటలు అంటుకున్నాయి. బావాజీ, అప్సాన్‌లకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కాగా అల్తాఫ్‌ ఆరోగ్య స్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీకి తరలించారు. బావాజీ, అప్సాన్‌లను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు.

ఆర్థిక అక్షరాస్యతపై

అవగాహన ముఖ్యం

తంబళ్లపల్లె: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటేనే బ్యాంకు లావాదేవీలలో సులభంగా లబ్ధి పొందగలరని ఆర్‌బీఐ కౌన్సెలర్లు శోభన్‌,శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అనంతపురం జిల్లా వలంటీరీ ఇంట్రిగేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(విడ్స్‌) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్‌, పెన్షన్‌ ప్లానింగ్‌, పొదుపులు, సీనియర్‌ సిటిజెన్స్‌ బ్యాంకు సేవలను వివరించారు. ఎంపీడీఓ పాల్గొన్నారు.

బాబోయ్‌.. ఆ మలుపు!

బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌ ఘాట్‌రోడ్డు మూడో మలుపు ప్రమాదకరంగా మారింది. ఆదివారం రాత్రి మూడో మలుపు వద్ద టాటా ఏస్‌ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇదే చోట సోమవారం సాయంత్రం జరిగిన బైక్‌ ప్రమాదం ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలు. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన తోఫిక్‌ (22), జమీల్‌ (22)లు బైక్‌పై సోమవారం హార్సిలీహిల్స్‌ వచ్చారు. కొండపై సరదాగా గడిపిన ఇద్దరూ సాయంత్రం బైక్‌పై వెనుదిరిగారు. మూడో మలుపు వద్దకు రాగానే అదుపుతప్పిన బైక్‌ ఎడమవైపు ఉన్న ఇనుప రేలింగ్‌ను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. 108లో బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు.

మదనపల్లెలో వ్యక్తి

అనుమానాస్పద మృతి

మదనపల్లెటౌన్‌: మదపపల్లెలో ఓ వ్యక్తి అనుమానస్పదిస్థితిలో మృతి చెందడం సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బొంబూ వీధికి చెందిన అన్సర్‌ (65) స్థానిక వారపు సంతలోని ఖాజా కూరగాయల మార్కెట్లో రైటర్‌ గా పనిచేస్తాడు. ఇతని భార్య సాజీద నాలుగేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి అన్సర్‌ తన ఇద్దరు కుమారులతో కలసి నివసిస్తున్నాడు. సోమవారం తను ఉంటున్న ఇంట్లో అనుమానస్పదంగా చనిపోయి ఉండటం స్థానికులు గుర్తించారు. తలపై గాయం ఉండడంతో ఎవరైనా కొట్టి చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామ అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement