సంబేపల్లె : గత వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఆలయాలకు మహర్దశ కలిగిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా అన్నారు. రాయచోటి నియో జకవర్గంలోని సంబేపల్లె మండల శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఉత్సవ నిర్వాహకులు జి.ఉపేద్రనాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ కవితారమేశ్‌రెడ్డి, రమేశ్‌కుమార్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి మాజీ మంత్రి రోజాను ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా కొండలరాయుడు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరాయుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరు సుఖసంతోషాలతో, ఐశ్వ ర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డిల కృషితో ఆలయాల నిర్మాణాలు విస్తృత స్థాయిలో చేపట్టడం అభినందనీయమన్నారు. లక్ష్మీనరసింహస్వా మి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆమె ఆకాంక్షించారు. కాగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మూ డొందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండలరాయుడు శ్రీలక్ష్మీనరసింహస్వామికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం కదిలించి, దాన్యాదివాసం అనంతరం నూతన విగ్రహ ప్రతిష్టకు ముందు నిర్వహించే పిలుపు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
భక్తులు,ప్రజలతో మమేకం...
పూజా కార్యక్రమాలుకు విచ్చేసిన భక్తులు ,ప్రజలతో మాజీ మంత్రి ఆర్‌కె. రోజా ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడి ప్రేమానురాగాలు పంచుకున్నారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొని అందరి అభిమానం పొందారు.
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి రోజా


