మదనపల్లెటౌన్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పీజీఆర్‌ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా నూతన ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చి న బాధితుల నుంచి అడిషనల్ ఎస్పీ అర్జీలను స్వీకరించారు. సత్వర చర్యలకు సంబంధిత సీఐ, ఎస్‌ఐలతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి పరిష్కారం చూపారు.
టీబీ ముక్త్
భారత్‌కు శ్రీకారం
–కలెక్టర్ నిశాంత్ కుమార్
మదనపల్లె: జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ వ్యాధి రహిత జిల్లాగా మా ర్చాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమంపై ప్రజ ల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభు త్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డీఎంహెచ్‌ఓ డాక్టర్ రాధిక ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
మదనపల్లె: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ సమావేశ హాలులో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటరెడ్డి సమాజసేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సేవా భావం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, కలెక్టర్ చల్లా కళ్యాణి, కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే ఏడి భరత్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి తేజస్విని పాల్గొన్నారు.


