– నేలపై కూలిన విద్యుత్ స్తంభం
బి.కొత్తకోట: స్థానిక కాళికమ్మ గుడి వీధిలో సోమ వారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వానరాలు విద్యుత్ తీగలపై విన్యాసాలు చేస్తూ గెంతడంతో విద్యుత్ స్తంభం మూడు ముక్కలైంది. ఆ సమయంలో వీధిలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాళికమ్మ గుడి వీధి, పంజూరమ్మ గుడి వీధి మధ్యలో విద్యుత్ సరఫరా లైను సాగుతుంది. వీధి మూలన విద్యుత్ స్తంభం తుప్పు పట్టడంతో దాని విద్యుత్ తీగలపై వానరాలు అటు ఇటు గెంతాయి. విద్యుత్ స్తంభం ఒక్కసారి గా నేల కొరిగింది. ఎదురుగా నిలిపివుంచిన ఖాజాఖాన్‌కు చెందిన ఇన్నోవాపై పడి తర్వాత నేలపై పడింది. దాంతో విద్యుత్ స్తంభం ముక్కలై, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమాచారం అందుకున్న డిస్కం ఏఈ విద్యుత్ సిబ్బందిని పంపించి కొత్త స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.


