ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు

Mar 23 2026 8:27 AM | Updated on Mar 23 2026 8:27 AM

ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు

మదనపల్లె: మదనపల్లె పట్టణ నడిబొడ్డున సాగుతున్న బహుదా కాలువ యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది.ఈ కాలువ 4.5 కిలోమీటర్లు సాగుతుంది.దీని విలువ చెప్పలేనంతగా ఉంది. కాలువ కావడంతో దీనికి ఇరువైపులా ఆక్రమణలు జోరుగానే సాగుతున్నాయి. అధికారుల సాక్షిగా భవనాలు నిర్మించుకున్నారు. రోజురోజుకు కాలువ కుచించుకుపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో భాగంగా బహుదాకాలువను తాజాగా రాంనగర్‌ పార్క్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్ల వద్ద దురాక్రమణకు గురవుతోంది. కాలువలోకి భవన నిర్మాణాల శిథిలాలను తరలించి నింపి చదును చేస్తున్నారు. దీని పక్కనే సమాధులు కూడా ఉన్నాయి వాటిని కూడా కప్పేస్తున్నారు. ఈ ఆక్రమణ సాగుతున్నా కాలువలోకి ఆక్రమణ జరుగుతోందా లేదా అన్నదానిపై అధికారులు పట్టించుకోవడం లేదు. నీటిపారుదల శాఖ పరిధికి చెందిన ఈ కాలువ విషయంలో అన్ని ప్రభుత్వ శాఖలు కఠినచర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే కాలువ ఇరువైపులా జరిగిన నిర్మాణాలపైనే ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న దురాక్రమణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆక్రమణ ఎవరు చేస్తున్నారు, కాలువ ఎంత పూడ్చారు, కాలువకు ఎంత నష్టం జరిగింది అన్న వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తేల్చాల్సి ఉంది. బాహుదా కాలువ అక్రమణపై రెవిన్యూ, మున్సిపల్‌, నీటి పురుష అధికారులు సంయుక్తంగా కఠిన చర్యలు చేపడితే గాని ఆక్రమణలపై ఉక్కు పాదం మోపే పరిస్థితి కనిపించడం లేదు.

కోర్టు ఆదేశాలే అమలుకాలేదు

మదనపల్లె పట్టణంలోని బి.కె.పల్లి గ్రామ పరిధిలో ఉన్న బహుదా కాలువపై, దానికి సంబంధించిన స్థలాల ఆక్రమణలపై 2008లో దాఖలైన రిట్‌ పిటిషన్‌న్‌పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్‌న్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆక్రమణలు చేసినప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోలేదని గుర్తించింది. ఈ అంశంపై తహసీల్దార్‌ ఇచ్చిన నివేదికలు, ఇతర రికార్డులను పరిశీలించిన కోర్టు, ఆక్రమణలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇప్పటికి అమలుకు నోచుకోలేని ఇలాంటి పరిస్థితుల్లో బాహుదా కాలువను సంరక్షించడం సాధ్యమా అన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి.

చర్యలు తీసుకుంటాం

బహుదా కాలువ ఆక్రమణపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని నీటిపారుల శాఖ ఈఈ సురేష్‌బాబు ఆది వారం అన్నారు. సోమవారం కాలువను పరిశీలించి ఏమేరకు ఆక్రమించారో పరిశీలించి విచారిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కుచించుకుపోతున్న బహుదా కాలువ

అధికారిక చర్యలు శూన్యం

కోర్టు ఆదేశాలున్నాఉలుకులేని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement