మదనపల్లె: కేంద్రీయ విద్యాలయం ప్రవేశాలకు సంబంధించి ఒకటవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల దరఖాస్తులను ఆన్‌లైన్ ( kvs angathan.nic.in) లో చేయాలని ప్రిన్సిపాల్ టి.వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఆరేళ్లు పైబడి ఉండాలని తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు ఆఫ్‌లైన్‌లో ఎస్టీ హస్టల్‌లోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెండో తరగతికి ఏడేళ్లు పైబడి, మూడో తరగతికి 8 ఏళ్లపైబడి, నాలుగో తరగతికి 9 ఏళ్లుపైబడి, ఐదో తర గతికి 10 ఏళ్లుపైబడి ఉండాలని తెలిపారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్‌కు ఏప్రిల్ రెండో తేది చివరిరోజని, పరిశీలనకు ఒరిజనల్ ధ్రువపత్రాలను తీసుకురావాలని కోరారు. వివరాలకు 9441738374, 95183 80684 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడప జిల్లా మేకలబాలయ్యపల్లె గ్రామంలో వెలసిన శ్రీ దుర్గమ్మ అమ్మవారిని భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. అదివారం మేకలబాలయపల్లి పరిధిలోని శ్రీదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రీచరణి కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వహకులు జి. వెంకటేశు తెలిపారు.


