ప్రస్తుతం ఎండు వరిగడ్డి ధరలు భగ్గుమంటుంటాయి. నెలరోజుల కిందట కిలో రూ.5 కే ఇచ్చేవారు. ఇప్పుడు కిలో రూ.8 నుంచి రూ.10కి పెంచేశారు. దళారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఈ కరువులో పశుపోషణ భారంగా మారింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా వస్తోంది. – నరసమ్మ, పాడిరైతు, కమ్మపల్లె
పశుపోషణ భారంగా మారింది
పశుపోషణ భారంగా మారింది. నాకు రెండు ఆవులు ఉన్నాయి. పుష్కలంగా గడ్డిదొరికే రోజుల్లో ఒక్కో ఆవు 5 లీటర్ల పాలు ఇచ్చేది. ప్రస్తుతం పాల దిగుబడి తగ్గిపోతోంది. దీంతో పాలల్లో వచ్చే రాబడి ఎక్కువ శాతం పశుపోషణకే సరిపోతోంది.
–రమణయ్య, పాడిరైతు, కురవపల్లె


