రూ.వంద కోట్లు దాటిన టౌన్‌బ్యాంక్‌ డిపాజిట్లు | - | Sakshi
Sakshi News home page

రూ.వంద కోట్లు దాటిన టౌన్‌బ్యాంక్‌ డిపాజిట్లు

Mar 23 2026 8:27 AM | Updated on Mar 23 2026 8:27 AM

నాలుగు జిల్లాల్లో సేవల విస్తరణ

చైర్మన్‌ విద్యాసాగర్‌

మదనపల్లె : మదనపల్లె కో–ఆపరేటివ్‌ టౌన్‌ బ్యాంక్‌ డిపాజిట్లు వంద కోట్లు దాటి రూ.102.03 కోట్లకు చేరిందని ఆ బ్యాంకు చైర్మన్‌ ఎన్‌.విద్యాసాగర్‌ అన్నారు. ఆదివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మహాజన సభ ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనితీరు సమీక్షను బ్యాంకు సీఈవో పీవీ ప్రసాద్‌ విడుదల చేశారు. వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. బ్యాంకు లావాదేవిలు, పనితీరును సమీక్షించారు. అనంతరం విద్యాసాగర్‌ మాట్లాడుతూ 1964లో స్థాపించిన బ్యాంకు స్థిరంగా అభివృద్ధి సాధిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. బ్యాంక్‌ డిపాజిట్లు రూ.102.03 కోట్లకు చేరుకోగా, రుణాలు రూ.78.22 కోట్లకు పెరిగాయన్నారు. మొత్తం వ్యాపారం రూ.111.22 కోట్లుగా నమోదైందన్నారు. బ్యాంకుకు రూ.11.81 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. బ్యాంకును మరింత బలోపేతం చేయడానికి టైర్‌–1 స్థాయి నుంచి టైర్‌–2 స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీలేరులో బ్యాంకు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సీఈవో ప్రసాద్‌ మాట్లాడుతూ బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. రైతులు, చిన్న వ్యాపారులకు రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ సేవల్లో భాగంగా యూపీఐ, గూగుల్‌ పే, ఫోన్‌ పే, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పా రు. భవిష్యత్‌లో మరిన్ని శాఖలను ప్రారంభించి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సభలో వైస్‌ చైర్మన్‌ భాస్కర్‌కుమార్‌, డైరెక్టర్లు రవికాంత్‌, రవీంద్రనాథ్‌, ముక్తియార్‌ఖాన్‌, సోమశేఖర్‌, వెంకటేష్‌ ప్రసాద్‌, నాదేళ్ళ శివ, దేవేంద్ర, సర్దార్‌ఖాన్‌, భాస్కర్‌, నిరంజన్‌, ప్రసాద్‌, కోటేశ్వరరావు, ఆకుల కృష్ణమూర్తి, మేనేజర్‌ జయచంద్రనాయుడు, రాధిక, రాజశేఖర్‌, రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement