చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయస్వామి ఖ్యాతి మరోసారి వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన 5 బంగారు ఉంగరాలు తిరిగి లభ్యం కావడంతో.. రాజనాల బండ మహిమ మరోసారి రుజువైందని స్థానికులు అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన ఓ దంపతుల ఇంట్లో గతేడాది డిసెంబరులో 5 బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. చుట్టుపక్కల ప్రజలు వారికి రాజనాల బండ మహిమను వివరించారు. వారు గత నెలలో రాజనాలబండకు చేరుకొని పూజలు చేసి వెళ్లారు. అనుమానితులతో సమావేశమై రాజనాలబండలో శనివారం ప్రమాణం చేయాలని చెప్పగా.. ఉదయాన్నే ఇంటి ఆవరణలో ఆ ఉంగరాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గుర్తించిన బాధితులు రాజనాలబండకు చేరుకొని స్వామివారి పాధాల చెంత పెట్టి పూజలు చేశారు. అనంతరం అర్చకులు కృష్ణమూర్తి, గ్రామపెద్దలు కలిసి బాధితులకు నగలు అందజేశారు.
రాజనాల బండ మహిమే అంటున్న స్థానికులు


