ఇద్దరు ఎస్‌ఓల మార్పు | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు ఎస్‌ఓల మార్పు

Mar 22 2026 1:50 AM | Updated on Mar 22 2026 1:50 AM

ఇద్దరు ఎస్‌ఓల మార్పు విజయదుర్గమ్మను దర్శించుకున్న శ్రీచరణి తారా జువ్వ వెలిగిస్తుండగా అపశృతి

మదనపల్లె: మున్సిపాలిటీలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారుల్లో(ఎస్‌ఓ) ఇద్దరిని మార్పుచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలకు వైఎస్సార్‌ కడపజిల్లా రాజంపేట, చిత్తూరు ఆర్డీఓలను నియమించారు. అయితే పొరుగుజిల్లాల ఆర్డీఓలు కావడంతో ఏ జిల్లాకు చెందిన అధికారులను ఆ జిల్లా మున్సి పాలిటీలకు నియమిస్తే పాలనా సౌలభ్యం ఉంటుదని భావించిన ప్రభుత్వం పుంగనూరుకు మదనపల్లె సబ్‌కలెక్టర్‌, రాయచోటికి అక్కడి అర్డీఓలను ప్రత్యేకాధికారులుగా నియమించారని అధికార వర్గాలు తెలిపాయి.

కడప కార్పొరేషన్‌: కడప నగరం బిల్టప్‌ వద్దనున్న శ్రీ విజయదుర్గాదేవి ఆమ్మవారిని భారత మహిళ క్రికెట్‌ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్‌రావు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచరణి తల్లి పదేళ్లుగా ప్రతి మంగళవారం రాహు, కేతు పూజలు నిర్వహిస్తుంటారని, ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు.

మదనపల్లెటౌన్‌: పంటలు నాశనం చేస్తున్న కోతులను బెదిరించేందుకు తారా జువ్వలు వెలిగిస్తుండగా రైతు తొడలోకి ఓ జువ్వ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై వివరాలు.. చీకిలబైలుకు చెందిన రైతు చిన్నయ్య(60)వ్యవసాయ బావి వద్ద సాగు చేసిన టమాటా, ఇతర కూరగాయల పంటల్లోకి కోతులు రావడంతో వాటిని తరిమేందుకు తారా జువ్వలు వెలిగించాడు. ఓ తారా జువ్వ తిరిగి ఆ రైతు తొడలోకి దూసుకుపోయి పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన రైతును కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement