మదనపల్లె: జిల్లాలో గ్యాస్ సమస్యలు తలెత్తకుండా గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లతో గ్యాస్ సిలిండర్ల సరఫరా, నిల్వలు, డెలివరీ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొరత లేదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించగా పర్యవేక్షణ అధికారులుగా డివిజనల్ స్థాయి అధికారులను నియమించినట్టు చెప్పారు. అలాగే జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్యాస్ కొరత వస్తుందనే అపో హ తో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేయడం అవసరం లేదని తెలిపారు. పట్టణ వినియోగదారులు 25 రోజులు, గ్రామీణ వినియోగదారులు 45 రోజుల గడువులో మాత్రమే బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ చేసిన తర్వాత ఒకటి నుంచి మూడు రోజులలో ఓటీపీ వస్తుందని, ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే గ్యాస్ సరఫరా జరుగుతుందని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లు (14.21 కిలోలు) వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే నిత్యావసరాల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కంట్రోల్ రూములు, టీమ్ వివరాలు


