రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన కాలిబాటలో నడిచి వెళ్లి..ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం ఈ సారైనా వేలాదిమంది భక్తులకు కల్పించాలని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని అన్నమయ్య ఉద్యానవనంలో టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమాచార్యుల వర్ధంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ గతఏడాది అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులు తిరుమల మహాపాదయాత్ర చేపట్టాలని సిద్ధమయ్యారన్నారు. అయితే చివరి క్షణంలో ఈమార్గంలో యాత్రగా వెళ్లకూడదని అటవీశాఖ ఆంక్షలు పెట్టిందన్నారు. దీంతో భక్తుల మనోభావాలకు దెబ్బతగిలిందన్నారు.ఇలాంటి విధానం పునరావృతం కాకుండా ప్రభుత్వం, అటవీశాఖ చూడాలన్నారు.
● టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్యుని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీతసభలు, హరికథలు భక్తులను అలరించాయి.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి


