కడప ఎడ్యుకేషన్ : క్రమశిక్షణ, నిరంతర శ్రమ క్రీడాకారులను ఉన్నత స్థితిలో నిలబెట్టుతాయని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రవికుమార్ అన్నారు. ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులపాటు జరిగిన యోగివేమన విశ్వవిద్యాలయం అంతర కళాశాలల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో కడప ఆర్ట్స్ కళాశాల క్రీడాకారులు 20 పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ శుక్రవారం అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమేష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జి డాక్టర్ టి.హజరతయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
విజేతలు వీరే..
బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థి జి.సింహాచలం 5 (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు, బీబీఏ తృతీయ సంవత్సరం కే మహేష్ నాలుగు రజత పతకాలు సాధించారు. బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న లోకేశ్వరరావు 5(1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం), టి.మనోజ్ కుమార్ 2 రజతాలు, వినోద్ 1 రజతం సాధించారు. బాలికల్లో నీలామహేశ్వరి జావెలిన్ త్రోలో రజితం, స్పందన 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించారు.


